Giddalur: ముండ్లపాడులో ప్రచార జోరు.. టీడీపీ అభ్యర్థి రంగనాయకులు దూకుడు!
Giddalur: గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి మండ్లా రంగనాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
Giddalur: ముండ్లపాడులో ప్రచార జోరు.. టీడీపీ అభ్యర్థి రంగనాయకులు దూకుడు!
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి మండ్లా రంగనాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు.
గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తూ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. తనకు మద్దతు తెలిపి, ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మండ్లా శేఖర్, గంజి వీరయ్యతో పాటు పలువురు కీలక టీడీపీ నాయకులు రంగనాయకులకు మద్దతుగా పాల్గొన్నారు. పలువురు గ్రామస్తులు సైతం ప్రచారంలో పాల్గొన్నారు.




