Rajampeta: 'స్మార్ట్ కిచెన్' స్థల పరిశీలనలో కలెక్టర్, తెదేపా నేత!

Rajampeta: సుండుపల్లి పాఠశాలల్లో 'స్మార్ట్ కిచెన్' నిర్మాణానికి కడప కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, రాజంపేట తెదేపా నేత జగన్ మోహన్ రాజు స్థల పరిశీలన చేశారు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 1 Aug 2026 12:29 PM IST
Rajampeta
X

Rajampeta: 'స్మార్ట్ కిచెన్' స్థల పరిశీలనలో కలెక్టర్, తెదేపా నేత!

జిల్లా కలెక్టర్ తో కలిసి పాఠశాలల్లో 'స్మార్ట్ కిచెన్' కొరకు స్థల పరిశీలన చేసిన ఇంచార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు

​సుండుపల్లి / రాజంపేట:

విద్యార్థులకు మరింత పరిశుభ్రమైన, రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించే లక్ష్యంతో 'స్మార్ట్ కిచెన్' (Smart Kitchen) ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాలను రాజంపేట నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు, కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఐఏఎస్ గార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

​జీకే రాసుపల్లి ప్రభుత్వ హైస్కూల్, టీ.సుండుపల్లిలోని ప్రభుత్వ హైస్కూల్ ప్రాంగణాలను వారు సందర్శించి, స్మార్ట్ కిచెన్ నిర్మాణానికి ఏ స్థలం అనుకూలంగా ఉంటుందనే అంశంపై అధికారులతో చర్చించారు.

​కేజీబీవీ స్కూల్ తనిఖీ - తల్లిదండ్రులతో ఆరా

​అనంతరం సుండుపల్లి మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని (KGBV) వారు తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, వసతి, భోజనం నాణ్యతపై అక్కడ ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో వసతుల మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

​ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నిధియా మీనన్ ఐఏఎస్, రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన ఐఏఎస్ గార్లు, పలువురు అధికారులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story