Proddatur: భారీ పోలీసు బందోబస్తు మధ్య కొత్తపల్లె ప్రజాభిప్రాయ సేకరణ!
Proddatur: వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మునిసిపాలిటీలో కొత్తపల్లె పంచాయతీ విలీనంపై నిర్వహించిన గ్రామసభ తీవ్ర ఉత్కంఠ రేపింది.
Proddatur: భారీ పోలీసు బందోబస్తు మధ్య కొత్తపల్లె ప్రజాభిప్రాయ సేకరణ!
Proddatur: వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కొత్తపల్లి పంచాయతీని ప్రొద్దుటూరు మునిసిపాలిటీ భవిషత్తు లో కార్పొరేషన్ అయేదానికి అవకాశం ఉంది కనుక విలీనం చేసే అంశంపై అధికారులు ఏర్పాటు చేసిన గ్రామసభ తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు అధికారులు.
కొత్తపల్లి పంచాయతీని మునిసిపాలిటీలో విలీనం చేయాలా వద్దా అన్న అంశంపై పంచాయతీ అధికారులు గ్రామసభను నిర్వహించారు. ఈ సభకు కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వాస్తవానికి ఈ నెల 19వ తేదీనే అధికారులు మొదటిసారి ఈ గ్రామసభను ఏర్పాటు చేశారు.
అయితే పంచాయతీ విలీనాన్ని మాజీ సర్పంచ్ శివచంద్ర రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అధికారులు ఆ రోజుకి సభను వాయిదా వేశారు. పోలీసు బందోబస్తు, ఆధార్ కార్డుల పరిశీలన
గతంలో జరిగిన రగడను దృష్టిలో ఉంచుకుని, ఈరోజు చేపట్టిన గ్రామసభ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. స్థానికులకు మాత్రమే అనుమతినిస్తూ... ఆధార్ కార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రజలను సభా ప్రాంగణంలోకి పంపుతున్నారు.
మరోవైపు విలీనాన్ని సమర్థిస్తున్న, వ్యతిరేకిస్తున్న వర్గాల మధ్య తీవ్ర పోటీ వాతావరణం నెలకొనడంతో... ఈ ప్రజాభిప్రాయ సేకరణలో అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారోనని స్థానికంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.




