Madanapalle: మదనపల్లెలో ఉద్రిక్తత.. సీఐ తీరుపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా మండిపాటు

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సీఐ అకారణంగా యువకుడిపై దాడి చేశారంటూ గ్రామస్థుల ఆందోళన.

Srinivasulu, Madanapalle
Published on: 26 May 2026 9:54 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లెలో ఉద్రిక్తత.. సీఐ తీరుపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా మండిపాటు

అన్నమయ్య జిల్లా: మదనపల్లె రూరల్ మండలం వేంపల్లి క్రాస్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేంపల్లికి చెందిన శ్రీనివాసులు నాయుడు అనే యువకుడిపై మదనపల్లె తాలూకా సీఐ కళా వెంకటరమణ అకారణంగా బూట్ కాలితో తన్ని, దాడి చేశారంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు నిరసనగా గ్రామస్థులు మూకుమ్మడిగా వేంపల్లి క్రాస్ వద్ద మదనపల్లె–బెంగళూరు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఘటన స్థలానికి చేరుకుని గ్రామస్థులకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా సీఐ కళా వెంకటరమణ వ్యవహారశైలి, ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. గ్రామస్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేసినట్లు సమాచారం.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story