Annamayya: అన్నమయ్య జిల్లాలో దొంగల బీభత్సం.. మాజీ సర్పంచ్ ఇంట్లో భారీ చోరీ!

Annamayya: అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం గుట్టపల్లిలో మాజీ సర్పంచ్ చిదంబర్ రెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 18 Jun 2026 11:02 AM IST
Annamayya
X

Annamayya: అన్నమయ్య జిల్లాలో దొంగల బీభత్సం.. మాజీ సర్పంచ్ ఇంట్లో భారీ చోరీ!

Annamayya: అన్నమయ్య జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. సంబేపల్లి మండలంలోని గుట్టపల్లిలో వైసీపీ మాజీ సర్పంచ్ చిదంబర్ రెడ్డి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు భారీ చోరీకి పాల్పడి బీభత్సం సృష్టించారు.

ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లో కి చొరబడి ఇంట్లో ఉన్న బీరువాలను బద్దలు కొట్టి అందులో భారీగా బంగారు, వెండి ఆభరణాలు, 2 లక్షలు నగదు తోపాటు విలువైన పట్టు చీరలను సైతం దోచుకెళ్లారు.

ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంబేపల్లి మండలంలో ఇటీవల కాలంలో వరస దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story