Thotapalli: తోటపల్లి రైతులు చేసిన పాపం ఏంటి..? పవన్ కళ్యాణ్, చంద్రబాబు హామీలు ఏమయ్యాయి..? కూటమి సర్కార్‌పై రైతు సంఘం ఫైర్!

Thotapalli: తోటపల్లి పాత కాలువల ఆధునీకరణ పనులను కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో చేర్చకపోవడంపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండిపడింది.

KAILASH SAHU, PALAKONDA
Published on: 21 May 2026 8:14 AM IST
Thotapalli: తోటపల్లి రైతులు చేసిన పాపం ఏంటి..? పవన్ కళ్యాణ్, చంద్రబాబు హామీలు ఏమయ్యాయి..? కూటమి సర్కార్‌పై రైతు సంఘం ఫైర్!
X

పాలకొండ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో గతంలో తీసుకున్న 25 ప్రాజెక్ట్ లతో పాటు కొత్తగా మరో 11 ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో తీసుకొని 2028 డిసెంబర్ నాటికి గుర్తించిన 36 ప్రాజెక్టు పనులు పూర్తి చేయుటకు కావలసిన నిధులను సమకూర్చి వేగవంతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆయా ప్రాజెక్టు పరిధిలో ఉన్న రైతన్నకి ఎంతో మేలు జరుగుతుంది.

అయితే మా బ్రిటిష్ కాలం నాటి తోటపల్లి పాత కాలువలు ఆధునీకరణ పనుల పరిధిలో గల రైతులు చేసిన పాపం ఏమిటని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడిపి అప్పలనాయుడు ప్రభుత్వాన్ని నిలదీసారు.

2018లో,2024 ఎన్నికల సభలో జనసేన పార్టీ అధినాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పాలకొండ సందర్శన సందర్భంగా భారీ బహిరంగ సభలో హామీ ఇచ్చి ఉన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశాన్ని హామీ ఇచ్చి ఉన్నారు. మరి వారి హామీలు అమలు చేయించటం లో స్థానిక శాసనసభ్యులు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయటానికి వేసుకున్న కాల పట్టిక 2028 డిసెంబరు అంటే 2029 లో జరిగే ఎన్నికల ముందు మరి పాలకొండ ప్రాంతానికి సంబంధించిన తోటపల్లి కాలువల ఆధునీకరణ పనులు జరగవు అని స్పష్టంగా క్యాలెండర్ తెలియజేస్తున్నది.

ప్రభుత్వ నిర్ణయంతో వంగర (రాజం నియోజకవర్గం) మండలం,కురుపాం నియోజకవర్గ పరిధిలో గల గరుగుబిల్లి,జిఎం వలస, పాలకొండ నియోజకవర్గ పరిధిలో గల వీరఘట్టం, పాలకొండ,ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలోగల బూర్జ్యమండలం లో గల ఓపెన్ హెడ్ ఛానల్ మరియు ఓనిగడ్డ ఆయకట్టు రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

తోటపల్లి ప్రాజెక్టు వద్ద పాత కుడి ఎడమ కాలవల పరిధిలో గల పాడైపోయిన షట్టర్స్ ను బాగు చేయాలని గత ఆగస్టు నెలలో పాలకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద,పార్వతీపురం కలెక్ట్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లలో కలెక్టర్ సమక్షంలో జరిగిన చర్చల సందర్భంగా ఏఈ రమణ గారు వారం పది రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఖరీఫ్ సీజన్ కు ఆటంకం లేకుండా షార్ట్స్ బాగుచేస్తామని మాట ఇచ్చినప్పటికీ నేటికీ వాటి గురించి అదే లేదు గతి లేదు ఆయన ఒక మాంత్రుడు లాగా కళ్ళ కట్టినట్టుగా చెప్పగలిగారు కానీ నేటికీ అవి బాగు చేయకపోవడంతో సకాలంలో తగినంత నీరు కాలువలో విడుదల కాక పంట నష్టపోతున్నాము. అత్యవసర పరిస్థితుల్లో నీటిని నియంత్రణకు కూడా సాధ్యం కావడం లేదు. కావున తక్షణమే వాటిని బాగు చేయాలని కోరుచున్నాము.

వ్యవసాయ సాగుకు వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి కాలువ ద్వారా సాగునీరు అందక పంట చివరి కాలంలో ఆకాశం వైపు ఎదురు చూసి వరుణుడు కరుణిస్తే పంటలు పండుతున్నాయి లేకపోతే పంట ఎండి నష్టపోవాల్సి వస్తుంది . ఇలాంటి నేపథ్యంలో ప్రాధాన్యత క్రమ ప్రాజెక్టులలో తోటపల్లి కాలువ ఆధునీకరణ పనులను చేర్చుకపోవడం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రైతాంగం నిరాశ చెందుతుంది. తక్షణమే దీనిపై కూటమి ప్రభుత్వం పునర్ ఆలోచనచేసి ప్రాధన్యతాక్రమ ప్రాజెక్టులలో తోటపల్లి పాత కాలువాలను ఆధునీకరణ పనులను చేర్చడానికి స్థానిక శాసన సభ్యులు చొరవ చూపాలని తోటపల్లి కాలువల ఆధునీకరణ పనులు సాధన సమితి మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తున్నది.

లేకుంటే గతం వలె రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేయక తప్పదని సంఘం కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story