T. Sundupalli: ఇసుక టిప్పర్ ధాటికి ఇద్దరు మృతి

T. Sundupalli: అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి వద్ద ఇసుక టిప్పర్ ప్రమాదంలో ఇద్దరు మృతి.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 22 July 2026 12:36 PM IST
T. Sundupalli
X

T. Sundupalli: ఇసుక టిప్పర్ ధాటికి ఇద్దరు మృతి

T. Sundupalli: అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి మండలం ఉప్పరపల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నగొల్లపల్లి గ్రామానికి చెందిన రవి మరియు జయ దుర్మరణం చెందిన విషయం తెలిసిన వెంటనే విజయవాడలో వున్న రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తక్షణమే స్పందించారు.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత అధికారులు, మండల టీడీపీ నాయకులు మరియు బాధిత కుటుంబ సభ్యులతో చరవాణి ద్వారా మాట్లాడి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషాద ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.

ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబాలకు మనోధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

జిల్లా యంత్రాంగం బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం, అవసరమైన అన్ని విధాల మద్దతు అందించి, ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా రోడ్డు భద్రతపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ తీరని దుఃఖాన్ని భరించే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ బాధిత కుటుంబాల పక్షాన నిలుస్తుంది.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story