Veeraballi: గోదావరి స్ట్రైకర్స్ క్రికెట్ టీమ్‌కు ఎంపికైన తోపిక్ ఆలీఖాన్!

Veeraballi: ఆంధ్ర టెన్నిస్ బాల్ లీగ్‌కు వంగిమళ్ల విద్యార్థి తోపిక్ ఆలీఖాన్ ఎంపిక వీరబల్లి ఎస్‌డీకేఆర్ కళాశాలలో ఘనంగా సత్కారం

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 4 Sept 2026 2:35 PM IST
Veeraballi
X

Veeraballi: గోదావరి స్ట్రైకర్స్ క్రికెట్ టీమ్‌కు ఎంపికైన తోపిక్ ఆలీఖాన్!

Veeraballi: వీరబల్లి మండలం వంగిమళ్ళ కస్పాకు చెందిన తోపిక్ ఆలీఖాన్ ఆంధ్ర టెన్నిస్ బాల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్లో ప్రతిభ కనపర్చి ఆక్షణ్ లో గోదావరి స్ట్రైకర్స్ టీమ్ కు ఎంపిక కావడం అభినందనీయమని విఆర్డిఎస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సురేంద్రారెడ్డి అన్నారు.

స్థానిక ఎస్డికేఆర్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న తోపిక్ ఆలీఖాన్ ను కళాశాల యాజమాన్యం, తోటి విద్యార్థులు శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.కళాశాల డైరెక్టర్ రవిశేఖర్ రెడ్డి మాట్లాడుతు తమ విద్యార్థి తోపిక్ చదువుతో పాటు క్రికెట్లో రాష్ట్ర స్థాయిలో రాణించడం గర్వకారణమని తెలిపారు.క్రికెట్ ఆడటం అంటే ఎవరికైనా కలే. ఆ కలను అందుకోవాలంటే బలమైన కసి, నిరంతర సాధన తప్పనిసరి అని తెలిపారు.

సురేంద్రారెడ్డి మాట్లాడుతు సాధారణంగా టెన్నిస్ బాల్ క్రికెట్ ను గల్లీలకే పరిమితం అనుకున్నారు కానీ లీగ్ ద్వార గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రతిభావంతులైన కుర్రాళ్ళు వెలుగులోకి రావడం హర్షించదగ్గ విషియమని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది నాగయ్య, వెంకటరమణ,విద్యార్థులు పాల్గొన్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI