Rayachoti: రాయచోటిలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు!

Rayachoti: రాయచోటి ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ట్రాఫిక్ పోలీసుల అవగాహన సదస్సు. మైనర్లు వాహనాలు నడపవద్దని, హెల్మెట్ తప్పనిసరి అని ఎస్పీ ధీరజ్ ఆదేశాలు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 1 Sept 2026 2:01 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు!

Rayachoti: జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,.గారి ఆదేశాల మేరకు, రాయచోటి లోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ట్రాఫిక్ సీఐ కృష్ణారెడ్డి, ఎస్ఐ సుధాకర్ రెడ్డి విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపకూడదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అధికారులు స్పష్టం చేశారు.

నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే ఘోర రోడ్డు ప్రమాదాల వీడియోలను ప్రదర్శించి విద్యార్థుల్లో తీవ్ర ఆలోచన రేకెత్తించారు. నేటి యువత బాధ్యతాయుతంగా ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షితమైన ప్రయాణం చేయాలని పోలీసు అధికారులు ఈ సందర్భంగా సూచించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story