Badvel: బద్వేల్‌లో విషాదం.. చేపల వేటకు వెళ్లి బావిలో పడి వ్యక్తి మృతి!
Badvel: కడప జిల్లా బద్వేల్ రూరల్ పరిధిలో విషాదం. చేపల వేటకు వెళ్లిన వ్యక్తి బావిలో పడి మృతి. గతంలోనూ అదే బావిలో మరొక ఘటన జరగడంతో స్థానికంగా కలకలం.
Badvel: బద్వేల్‌లో విషాదం.. చేపల వేటకు వెళ్లి బావిలో పడి వ్యక్తి మృతి!
కడప జిల్లా: బద్వేల్ రూరల్ పరిధిలోని శ్రీనివాసపురం వద్ద అదే గ్రామానికి చెందిన ఇండ్ల నాగార్జున అనే వ్యక్తి ఓ బావిలో చేపల వేట కోసం వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడటంతో మృతి చెందినట్లు సమాచారం. మృతుడు చేపల కోసం వెళ్ళినప్పుడు తనతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారని ప్రమాదవశాత్తు తను బావిలో పడటంతో ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో వెంట ఉన్న ఇద్దరు పిల్లలు ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసినప్పటికీ వారు భయపడి సమాచారాన్ని గోప్యంగా ఉంచారు.
చివరికి మృతి చెందిన సమాచారం బద్వేల్ రూరల్ పోలీసులకు చేరటంతో మృతదేహాన్ని బావి నుండి వెలికి తీయడం జరిగింది. గతంలో ఇదే బావిలో ఓ తండ్రి ఇద్దరు పిల్లలను తోసెయ్యటంతో వారు మృతి చెందారు అప్పటిలో ఆ సంఘటన సంచలముగా మారింది. మరల ఈ ఘటనతో అదే బావి వార్తలలోకి రావడం విశేషం.




