Rayachoti: అన్న మరణవార్త విని తమ్ముడి మృతి రాయచోటి మండలంలో విషాదం!
Rayachoti: రాయచోటి వద్ద విషాదం అన్న మరణ వార్త తట్టుకోలేక నిమిషాల వ్యవధిలోనే కన్నుమూసిన తమ్ముడు శెట్టివాండ్లపల్లెలో విషాదఛాయలు.
Rayachoti: అన్న మరణవార్త విని తమ్ముడి మృతి రాయచోటి మండలంలో విషాదం!
Rayachoti: రాయచోటి మండలం వరిగ గ్రామం శెట్టివాండ్లపల్లెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శెట్టివాండ్లపల్లెకు చెందిన బత్తుల వీరనాగన్న (70) గురువారం సాయంత్రం మృతి చెందారు. అన్న మృతి వార్త విన్న ఆయన సొంత తమ్ముడు బత్తుల రామచంద్ర తీవ్ర దిగ్భ్రాంతికి గురై నిమిషాల వ్యవధిలోనే మృతి చెందారు.
ఎంతో ఆప్యాయంగా కలిసిమెలిసి జీవించిన సొంత అన్నదమ్ములు ఇలా ఒకే సమయంలో మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో శెట్టివాండ్లపల్లెతో పాటు పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story




