Mydukur: భర్త మరణ తట్టుకోలేక గుండెఆగి భార్య మృతి దువ్వూరులో విషాదఛాయలు

Mydukur: దువ్వూరులో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో భర్త మృతి చెందిన వార్త విన్న వెంటనే భార్య సొమ్మసిల్లి పడి ప్రాణాలు విడిచింది.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 10 Aug 2026 9:00 AM IST
Mydukur
X

Mydukur: భర్త మరణ తట్టుకోలేక గుండెఆగి భార్య మృతి దువ్వూరులో విషాదఛాయలు

Mydukur: మరణంలోను భార్యాభర్తల భందం వీడలేదు, అనారోగ్యంతో భర్త మృతి చెందగ, ఆ వార్త తెలిసిన వెంటనే భార్య మృతి చెందిన విషాదః ఘటన దువ్వూరు లో చోటు చేసుకుంది.

దువ్వూరు మండలకేంద్రంలోని టీచర్స్ కాలనీ కి చెందిన ఇరగం రెడ్డి వెంకట రామి రెడ్డి (79) రిటైర్డ్ తెలుగు పండిట్ గా 2005 వ సంవత్సరంలో పదవి విరమణ పోందారు,ఈయనకు భార్య నారాయణమ్మ (68)కుమారులు శ్రీహరి రెడ్డి, చంద్రహస్ రెడ్డి, జయదేవ్ రెడ్డి ముగ్గురు సంతానం, ముగ్గురు హైదరాబాద్ లో స్థిరపడ్డారు.

ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా వెంకటరామిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు,ఈ క్రమంలో ఆయన కుమారుల వద్ద హైదరాబాద్ లో ఉంటున్నారు.ఆదివారం ఉదయం, ఆయన ఆరోగ్యం క్షీనించడంతో

హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆయన మృతి చెందారు,భర్త మరణ వార్త విన్న భార్య నారాయణమ్మ సోమ్మసిల్లి పడిపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగ ఆమే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని భందువులు తెలిపారు.

భార్యాభర్తలు ఓకే సారి మృతి చెందడంతో వారి కుటుంబ సబ్యులతో పాటు దువ్వూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి, మృతదేహాలను హైదరాబాద్ నుండి స్వగ్రామం దువ్వూరు కు తలలించి అంతక్రియలు చేయనున్నట్లు బంధువులు తెలిపారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story