Pulivendula: రైల్వే, ఇన్ఫోసిస్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం నిందితుల అరెస్ట్
Pulivendula: రైల్వే, ఇన్ఫోసిస్ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల పోలీసులు అరెస్ట్ చేసి రూ.8 లక్షల నగదును రికవరీ చేశారు.
Pulivendula: రైల్వే, ఇన్ఫోసిస్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం నిందితుల అరెస్ట్
పులివెందుల: YSR కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, IPS గారి ఆదేశాల మేరకు, పులివెందుల SDPO శ్రీ B. మురళి గారి పర్యవేక్షణలో, పులివెందుల U/G పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ప్రజలను మోసం చేసిన రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పులివెందుల U/G పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ K. శ్రీ రామ్ గారి ఆధ్వర్యంలో, SIs M. మధుసూదన్ రెడ్డి, L. తిమోతి మరియు సిబ్బంది కలిసి పులివెందుల U/G పోలీస్ స్టేషన్ Cr.No.23/2025 U/s 420 IPC మరియు Cr.No.203/2025 U/s 420 IPC కేసులలో నిందితుల కదలికలపై వచ్చిన విశ్వసనీయ సమాచారంతో నిఘా ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో 18.08.2026న సాయంత్రం 06.00 గంటలకు మరియు 07.00 గంటలకు, పులివెందుల మండలం కనంపల్లి చెక్పోస్ట్ మరియు కదిరి చెక్పోస్ట్ వద్ద నిందితులను గుర్తించి, పెద్దమనుషుల సమక్షంలో అరెస్ట్ చేశారు.
అరెస్ట్ అయిన నిందితులు:
1. నామల జన ప్రకాష్ రావు, వయస్సు 42 సంవత్సరాలు, తండ్రి నామల సత్యనారాయణ, D.No.10-34, శ్రీనివాస నగర్, కొమ్మాది రోడ్, PM పాలెం, కొమ్మాది, విశాఖపట్నం రూరల్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
2. క్రిష్ణయ్య మహేష్ @ వీరస్వామి క్రిష్ణ, వయస్సు 36 సంవత్సరాలు, వృత్తి: ప్రైవేట్ ఉద్యోగం, బత్తలవల్లం గ్రామం, వరదయ్యపాలెం మండలం, తిరుపతి జిల్లా.
అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను పులివెందుల గౌరవనీయ న్యాయస్థానం ఎదుట హాజరుపరచడం జరిగింది.




