Chennur: మనస్పర్థలతో ప్రియుడు.. ఆ బాధ భరించలేక ప్రియురాలు బలవన్మరణం!

Chennur: కడప జిల్లా చెన్నూరుకు చెందిన ఇద్దరు డిగ్రీ విద్యార్థులు మనస్పర్థల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 5 May 2026 11:11 AM IST
Chennur
X

Chennur: మనస్పర్థలతో ప్రియుడు.. ఆ బాధ భరించలేక ప్రియురాలు బలవన్మరణం!

చెన్నూర్: ఇద్దరు ప్రేమికుల బలవన్మరణం కడప. చెన్నూరు కు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ (19), హేమశ్రీ (19) కడపలో ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇయర్ పూర్తి చేశారు. వారిద్దరిది ఒకే గ్రామం కావడంతో కొన్నేళ్లుగా ఉన్న పరిచయం ప్రణయంగా మారింది. అయితే ఆదివారం వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో యోగేంద్ర కుమార్ కడప మృత్యుంజయకుంట లోని బంధువుల ఇంటికి వచ్చి రాత్రి ఫ్యాన్ ఉరేసుకొని చనిపోయాడు.

దీంతో విషయం తెలుసుకున్న ప్రియురాలు హేమశ్రీ చెన్నూర్ నుంచి వచ్చి ప్రియుడిని చూసేందుకు వారి ఇంటికి వెళ్ళింది. అయితే బంధువులు నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురై చెన్నూరుకు వచ్చి తన ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తుండగా కుటుంబ సభ్యులు అడ్డుకుని ఆమెను గదిలో పెట్టి తాళం వేయడంతో హేమశ్రీ గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story