Kadapa: ట్రాక్టర్, లారీ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి!
Kadapa: కడప: బద్వేల్ జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ను లారీ ఢీకొన్న ప్రమాలంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
Kadapa: ట్రాక్టర్, లారీ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి!
Kadapa: కడప జిల్లా బద్వేల్ జాతీయ రహదారి 67 నెల్లూరు రోడ్డు మడకలవారిపల్లె సమీపంలోని బైపాస్ హైవే మీద బండల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేసే సమయంలో అదుపు తప్పి వెనుక నుంచి ఢీకొన్న లారీ. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి.
మరణించిన ఇద్దరు వ్యక్తులు డ్రైవర్ పట్నం భాస్కర్( 40 ), తండ్రి పట్నం కొండన్న, చౌడూరు గ్రామము, ప్రొద్దుటూరు. తలసారి రమణయ్య (50) చౌడూరు గ్రామము, ప్రొద్దుటూరు. వీరితోపాటు లారీ డ్రైవర్ యు.గురవయ్య చాపాడు మండలము, పల్లవోలు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు, లారీ డ్రైవర్ను అత్యవసర చికిత్స నిమిత్తం కడప రిమ్స్ కు తరలించినట్లు సమాచారం.




