Mydukur: కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి

Mydukur: మైదుకూరులో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ప్రభుత్వానికి సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 17 May 2026 2:30 PM IST
Mydukur
X

Mydukur: కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి

మైదుకూరు: విద్యుత్ శాఖలో సుదీర్ఘకాలంగా చాలీచాలని జీతాలతో వెట్టిచాకిరీ చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సర్వీస్, విద్యా అర్హతలను పరిగణనలోకి తీసుకుని, వారిని తక్షణమే ఖాళీ పోస్టుల్లో భర్తీ చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నాయబ్ రసూల్, జిల్లా అధ్యక్షులు బి. ఎన్. నాగ సుబ్బయ్య శనివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

​ఈ సందర్భంగా డిస్కం ఉపాధ్యక్షులు శీలం సుబ్బరాయుడు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న జూనియర్ లైన్మెన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు నాగ మల్లయ్య మాట్లాడుతూ, విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని (OPS) అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ వర్తింపజేయాలని కోరారు.

​మైదుకూరు డివిజన్ పరిధిలోని జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడం ద్వారా కార్మికులపై ఉన్న పని ఒత్తిడిని తగ్గించవచ్చని డివిజన్ అధ్యక్షులు బండి రామ్మోహన్ పేర్కొన్నారు. గత పది నెలలుగా ఓ&ఎం (O&M) కార్మికులకు నిలిచిపోయిన ప్రమోషన్లను వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే కాశీనాయన, కలసపాడు సెక్షన్లకు అదనంగా లైన్ ఇన్స్పెక్టర్ పోస్టులను కేటాయించాలని కోరారు. ​మైదుకూరు డివిజన్ పరిధిలో ఒక ఫోర్‌మెన్ పోస్టుతో పాటు, ఎస్.ఎల్.ఐ (SLI) పోస్టులను కూడా అదనంగా కేటాయించాలని జిల్లా కమిటీ సభ్యులు రవికుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

​ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చాలి:

​విద్యుత్ శాఖ ఉద్యోగులకు సంబంధించిన 3 డీఏ (DA) లను వెంటనే విడుదల చేయాలని, అలాగే కొత్త పీఆర్సీ (PRC) ని తక్షణమే ప్రకటించాలని జిల్లా కమిటీ సభ్యులు ప్రసాద్ డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని యూనియన్ నాయకులు కోరారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story