Annamayya: ఈదురు గాలుల బీభత్సం.. కుప్పలు తెప్పలుగా రాలిన మామిడి కాయలు!
Annamayya: అన్నమయ్య మరియు కడప జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది.
Annamayya: ఈదురు గాలుల బీభత్సం.. కుప్పలు తెప్పలుగా రాలిన మామిడి కాయలు!
అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాల తోపాటు చుట్టుపక్కల ఉన్న కడప జిల్లా కు చెందిన వీరబల్లి, సుండుపల్లి మండలాలలో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీగా వీచిన ఈదురు గాలుల దాటికి మామిడి చెట్లు, వివిధ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లు నేలకూలాయి. ఈదురుగాలల బీభత్సానికి మామిడి చెట్లకు ఉన్న అరకొర మామిడి కాయలు నేల రాలిపోయాయి. దీంతో మామిడి పంటకు అపార నష్టం వాటిల్లింది. కోత దశలో ఉన్న మామిడి పంట నేల పాలు కావడంతో మామిడి రైతులు లబోదిబోమంటూ వాపోతున్నారు. ఏటా మామిడి పంట కోతకు వచ్చిన సమయంలో గాలివాన బీభత్సం సృష్టించడంతో అరకొర రాసిన మామిడికాయలు నేలపాలు అవుతూ వస్తున్నాయి. దీంతో మామిడి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం అందించాలని బాధిత మామిడి రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.




