Badvel: ఉపాధి హామీ చట్టం కొనసాగించాలి: వి. వెంకటేశ్వర్లు
Badvel: జీ రాం జీ పథకాన్ని రద్దు చేసి ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం నేత వి. వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
Badvel
Badvel: జీ రాం జీ పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బద్వేల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో పనిదినాలను 200 రోజులకు పెంచడంతో పాటు రోజుకు రూ.600 కూలీ చెల్లించాలని కోరారు.
పేదలందరికీ మూడు సెంట్ల ఇంటి స్థలం, ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని అన్నారు. పేదల కాలనీల్లో డీకేటీ పట్టాలు మంజూరు చేసి మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్‌ను రద్దు చేసి శ్రామిక మహిళల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరారు.
నష్టపోయిన రైతులకు రుణమాఫీ, వడ్డీ మాఫీతో పాటు కొత్త రుణాలు మంజూరు చేయాలని సూచించారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై దాడులు పెరుగుతున్నాయని, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం ఆందోళన కలిగిస్తోందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో దళిత యువత సామాజిక వివక్షను ఎదుర్కొంటున్నారని, అన్ని రకాల పెన్షన్లను కొత్తగా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పేదల భూముల పట్టా పాస్‌పుస్తకాలను ఆన్‌లైన్ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.




