Mydukur: వనిపెంట జెడ్పీ పాఠశాలలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!

Mydukur: వనిపెంట జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం. ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులు ప్రదానం చేసిన తమ్మిశెట్టి సుబ్బారాయుడు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 16 Aug 2026 9:03 AM IST
Mydukur
X

Mydukur: వనిపెంట జెడ్పీ పాఠశాలలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!

Mydukur: మైదుకూరు మండలం, వనిపెంట గ్రామంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్బంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్థానిక టీడీపీ నాయకులు శ్రీ తమ్మిశెట్టి సుబ్బారాయుడు కుటుంబ సభ్యులు జెండా ఎగురవేశారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ఎంతో మంది పోరాట యోధులు ప్రాణాలు అర్పించి స్వాతంత్య్రం సాధించారని ప్రతి విద్యార్థిని విద్యార్థులు దేశ భక్తి సేవా భావం అలవార్చుకోవాలని దేశ భవిష్యత్ తరగతి లో ఉందని ప్రతి విద్యార్థి విద్యార్థిని బాగా చదివి మంచి మార్కులు సాధించి మంచి స్థాయికి ఎదిగి పాఠశాలకు తల్లి దండ్రులకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.

2025-26 విద్యాసంవత్సరములో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు ప్రథమ(5000) ద్వితీయ(4000)తృతీయ(3000)నగదును మరియు మెమెంటో అందించి అభినందించారు.అదే విదంగా పాఠశాలకు కొత్త జిరాక్స్ మిషన్ మరియు కాంపౌండ్ గోడ మరమ్మత్తులు చేయించమని కోరగా ఖచ్చితంగా చేయిస్తానని తమ్మిశెట్టి సుబ్బారాయుడు హామీ ఇచ్చారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story