Varikuntla: వరికుంట్లలో అడుగంటిన భూగర్భ జలాలు!

Varikuntla: కాశినాయన మండలం వరికుంట్ల గ్రామంలో వర్షాల కోసం గంగమ్మకు బోనాలు సమర్పించిన ప్రజలు. అడుగంటిన భూగర్భ జలాలు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలని డిమాండ్.

P Upendra, Kadapa Porumamilla
Published on: 30 Aug 2026 12:01 PM IST
Varikuntla
X

Varikuntla: వరికుంట్లలో అడుగంటిన భూగర్భ జలాలు!

Varikuntla: కాశినాయన మండలంలోని తెలుగుగంగా ఎడమకాలువకు పైన వున్న గ్రామలైన వరికుంట్ల, నాయనపల్లె, ఆకులనారాయణ పల్లె, బాలాయపల్లె, గొంటువారిపల్లె, గంగనపల్లె, కొండ్రాజుపల్లె, సావిశెట్టిపల్లె గ్రామాలలో వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయినవి.

బోర్లకు సరిగ్గా నీళ్లు రాక పొలాలు ఎండిపోతున్నాయి.ఈ గ్రామాలలో మూగజీవాలకు సరియైన మేత లేక రైతన్నలు గేదెలు, మేకలు, గొర్రెలను అమ్ముకుంటున్నారు. చాలామంది కూలీలు గ్రామాలలో పనులు లేక పోరుమామిళ్ల చుట్టుపక్కల ప్రాంతాలకు ఆటోలలో పనులకు వెళ్ళుతున్నారు.

ఈ గ్రామాలు తెలుగుగంగా ఎడమ కాలువకు ఎగువ వైపున ఉన్నందువల్ల తెలుగుగంగా ఎడమ కాలువలో నీరు ప్రవహిస్తున్న ఈ గ్రామాలకు ఎటువంటి ప్రయోజనం లేదు. 2024 వ సంవత్సరం లో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తెలుగుగంగా ఎడమ కాలువలోని వాటర్ ను వరికుంట్ల పెద్ద చెరువుకు ఇవ్వాలనే ఆలోచనతో తెలుగుగంగా ఎడమ కాలువ నుండి పైపులైన్ వరికుంట్ల చెరువుకు పుడ్చారు.

రెండు సంవత్సరాల నుండి మిగిలిన పనులు నిలిచిపోయినాయి.వరికుంట్ల చెరువుకు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయి నీరు ఇస్తే ఈ గ్రామాలలో భూగర్భ జలాలు పెరిగి ప్రజలకు సాగు, త్రాగునీరు పుష్కలంగా లభిస్తుంది.

మండలంలో ఉద్యనవన పంటలు అయిన అరటి, జామ, సీతాఫలం, బొప్పాయి,మామిడి ఈ గ్రామాలలోనే రైతన్నలు ఎక్కువగా వేస్తారు.కరువుతో సాగుచేసిన పంటలు ఎండిపోతున్న ఈ గ్రామాలను ప్రభుత్వ అధికారులు వరికుంట్ల చెరువుకు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి నీరు అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

శనివారం వరికుంట్ల గ్రామ ప్రజలు వర్షం కోసం గంగమ్మ తల్లికి బోనాలు భక్తి శ్రద్దలతో సమర్పించారు. ఇప్పటికయినా ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తిచేసి ఈ గ్రామాలకు సాగు, త్రాగునీరు అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు

P Upendra, Kadapa Porumamilla

P Upendra, Kadapa Porumamilla

Next Story