Veeraballi: టీడీపీలోకి భారీగా వైకాపా నేతల చేరికలు చమర్తి జగన్

Veeraballi: వీరబల్లి మండలం గుర్రప్ప గారి పల్లెలో వైకాపాను వీడి టీడీపీలో చేరిన 25 కుటుంబాలు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 23 July 2026 9:38 PM IST
Veeraballi
X

Veeraballi: టీడీపీలోకి భారీగా వైకాపా నేతల చేరికలు చమర్తి జగన్

వీరబల్లి: వీరబల్లి మండలం కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలతోనే వైకాపాను వీడి భారీగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు పేర్కొన్నారు.

గురువారం నాడు వీరబల్లి మండలం, గుర్రప్ప గారి పల్లె,తొగట పల్లె నందు పర్యటిస్తూ వైకాపాకు చెందిన 25 కుటుంబాలను సాదరంగా జగన్ మోహన్ రాజు గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలకు రోళ్ళమడుగు ద్వారా త్రాగునీరు అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసినట్లు జగన్ మోహన్ రాజు గారు తెలియజేశారు.

పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలోనే పనులు ప్రారంభిస్తామని, అన్ని గ్రామాలకు త్రాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతేకాకుండా జల్ జీవన్ మిషన్ కింద 27 కోట్లు వచ్చాయని వాటి పనులను కూడా త్వరలోనే చేపడతామన్నారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో సీఎంకు సాటి ఎవరూ లేరన్నారు.

ఒకవైపు అభివృద్ధి / సంక్షేమం దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని జగన్ మోహన్ రాజు గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story