Pulivendula: కమలాపురంలో ఆర్యవైశ్య నేతపై దాడిని ఖండించిన వైఎస్సార్‌సీపీ నాయకులు!
Pulivendula: కూటమి ప్రభుత్వంలో ఆర్యవైశ్యులపై దాడులు పెరుగుతున్నాయని, కమలాపురం వైఎస్సార్‌సీపీ ఆర్యవైశ్య నేత సురేష్‌పై దాడి ఘటనను మాజీ మంత్రి ఖండించారు.
Pulivendula: కమలాపురంలో ఆర్యవైశ్య నేతపై దాడిని ఖండించిన వైఎస్సార్‌సీపీ నాయకులు!
Pulivendula: రాష్ట్రంలో ఆర్యవైశ్యులపై దాడులు జరుగుతున్నా యని, కూటమి ప్రభుత్వ పాలనలో ఆర్యవైశ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. పులివెందుల పట్టణంలోని వైయస్సార్ ఆడిటోరియం నందు మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమలాపురం నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు, మండల కో-ఆప్షన్ సభ్యుడు సురేష్‌పై జరిగిన దాడి ఘటనను ఆయన ఖండించారు.
రోడ్డు, ఫ్లైఓవర్ విస్తరణలో భూములు, ఆస్తులు కోల్పోతున్న బాధితులకు పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని సురేష్ ప్రశ్నించారని తెలిపారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు సురేష్‌ను సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకెళ్లి భౌతికంగా దాడి చేశారని ఆరోపించారు. అనంతరం టీడీపీ కార్యాలయానికి తీసుకెళ్లి కూడా దాడి చేసినట్లు పేర్కొన్నారు.
సురేష్ సతీమణి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు తొలుత స్పందించలేదని వెల్లంపల్లి ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి నరేన్ రామాంజుల్‌రెడ్డి ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోలీసులపై ఒత్తిడి తీసుకురావడంతో చివరకు సురేష్‌ను విడిచిపెట్టారని తెలిపారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకొని ‘జంగిల్ పాలన’ కొనసాగుతోందని విమర్శించారు.
ఆర్యవైశ్య కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం, దానిని అడ్డం పెట్టుకుని చందాలు, దందాలు సాగిస్తోందని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. పొట్టి శ్రీరాములు కార్యక్రమాల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేశారని, వాటికి సరైన లెక్కలు చూపడం లేదని విమర్శించారు.
దేవస్థానాల కమిటీల్లో ఆర్యవైశ్యులకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదని అన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్యవైశ్యులకు తిరుమలతో పాటు ఇతర దేవాలయాల్లో అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యులను మోసం చేస్తోందని ఆరోపించారు.
వైఎస్సార్‌సీపీ పీఏసీ అడ్వైజరీ కమిటీ సభ్యుడు గుబ్బా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులపై కేసులు నమోదు చేయడంతో పాటు అధికారులను ఉపయోగిం చి వేధింపులకు పాల్పడు తున్నారని ఆరోపించారు. ఆర్యవైశ్యులపై రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వేధింపులు గురి చేస్తున్నారన్నారు . రానున్న ఎన్నికల్లో ఆర్యవైశ్యులు కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కూటమి పాలనలో ఆర్యవైశ్యులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం వెంకట ప్రసాద్, వైఎస్సార్‌సీపీ పీఏసీ అడ్వైజరీ కమిటీ సభ్యుడు గుబ్బా చంద్రశేఖర్, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు రేపాల శ్రీనివాసులు, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు మారుతి ప్రసాద్, రాష్ట్ర ఆర్యవైశ్య కమిటీ కోశాధికారి మిట్ట కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.




