Vempalle: వేంపల్లి-చాగలమర్రి రహదారి విస్తరణ పనులు చేపట్టాలి

Vempalle: భూసేకరణ పూర్తికాక మూడేళ్లుగా నిలిచిన వేంపల్లి-చాగలమర్రి జాతీయ రహదారి విస్తరణ పనులు. వెంటనే పనులు ప్రారంభించాలని తులసి రెడ్డి డిమాండ్.

K. KESAVA PRATHAP REDDY, KADAPA
Published on: 22 July 2026 3:04 PM IST
Vempalle
X

Vempalle: వేంపల్లి-చాగలమర్రి రహదారి విస్తరణ పనులు చేపట్టాలి

వేంపల్లి: వేంపల్లి - చాగలమర్రి జాతీయ రహదారి విస్తరణ పనులను త్వరగా మొదలుపెట్టాలని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం వేంపల్లి లో కాంగ్రెస్ నాయకులు అధికారులతో కలిసి వేంపల్లి - చాగలమర్రి జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా తులసి రెడ్డి మాట్లాడుతూ వేంపల్లి -వీరపునాయునిపల్లి- ఎర్రగుంట్ల- ప్రొద్దుటూరు- కొర్రపాడు- రాజుపాలెం- చాగలమర్రి జాతీయ రహదారి 440 ని రెండు వరుసలు /నాలుగు వరుసలు రహదారిగా విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం 2023 -24 ఆర్దిక సంవత్సరంలో మంజూరు చేసింది అన్నారు.

ఈ రహదారి పొడవు 78. 95 కిలోమీటర్లు. అంచనా విలువ 1321. 02 కోట్ల రూపాయలు. టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఎన్ ఎస్ పి ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టెండర్ దక్కించుకుంది. భూ సేకరణ పూర్తికాని కారణంగా మూడు సంవత్సరాలు అయినా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు.

28 గ్రామాల పరిధిలో 433ఎకరాలు భూసేకరణ చేయాలి.ఇప్పటివరకు 32 0ఎకరాలు మాత్రమే భూ సేకరణ చేయడం జరిగింది . 90 శాతం భూసేకరణ అయితే గాని కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టలేడు.90 శాతం భూసేకరణ కావాలి అంటే ఇంకా 70 ఎకరాలు భూసేకరణ జరగాలి.

ఇప్పటికైనా జిల్లా రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ వహించి భూసేకరణ పూర్తి చేయాలని, విస్తరణ పనులు త్వరగా ప్రారంభించాలని తులసి రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జాతీయ రహదారుల అసిస్టెంట్ ఇంజనీర్ సురేందర్ రెడ్డి,,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ సుబ్రహ్మణ్యం, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గపు సమన్వయకర్త ధ్రువ కుమార్ రెడ్డి,వేంపల్లి మండల శాఖ అధ్యక్షుడు రామకృష్ణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అమర్నాథ్ రెడ్డి,ఉత్తన్న,ఐచర్ రమణ, చిన్నకోట్ల నాగరాజు, బద్రి, రాఘవయ్య, వేమయ్య,తదితరులు పాల్గొన్నారు.

K. KESAVA PRATHAP REDDY, KADAPA

K. KESAVA PRATHAP REDDY, KADAPA

Next Story