Rayachoti: వధూవరులను ఆశీర్వదించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

Rayachoti: విజయవాడలో జరిగిన గోగినేని సాయివెంకట ఆకాష్, నమ్రతల వివాహ రిసెప్షన్‌కు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 31 Aug 2026 11:21 PM IST
Rayachoti
X

Rayachoti: వధూవరులను ఆశీర్వదించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

రాయచోటి: విజయవాడలోని శ్రీ సీతారామ గార్డెన్స్ లో గోగినేని సాయివెంకట ఆకాష్, నమ్రత వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా సాయివెంకట ఆకాష్, నమ్రతలకు హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి నూతన దాంపత్య జీవితం ప్రేమానురాగాలు, పరస్పర నమ్మకం, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో నిండి కలకాలం ఆనందంగా సాగాలని మండిపల్లి ఆకాంక్షించారు.

వివాహ బంధంతో ఒక్కటైన నూతన దంపతుల జీవితంలో ప్రతి అడుగు విజయవంతంగా, ప్రతి మలుపు శుభప్రదంగా సాగాలి. ఇరువురి అనుబంధం నిండు నూరేళ్లు ప్రేమానురాగాలతో వర్ధిల్లుతూ, వారి కుటుంబంలో సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలన్నారు

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story