Rayachoti: శిబ్యాడలో సీఎం చంద్రబాబు, మంత్రి మండిపల్లి చిత్రపటాలకు పాలాభిషేకం!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం శిబ్యాడలో తాగునీటి సమస్యను పరిష్కరించిన సీఎం చంద్రబాబు, మంత్రి మండిపల్లి చిత్రపటాలకు గ్రామస్తులు పాలాభిషేకం చేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 2 Oct 2026 7:01 AM IST
Rayachoti
X

Rayachoti: శిబ్యాడలో సీఎం చంద్రబాబు, మంత్రి మండిపల్లి చిత్రపటాలకు పాలాభిషేకం!

Rayachoti: అన్నమయ్య జిల్లా శిబ్యాల గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి నీటి సమస్యను రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకొని పోవడంతో స్పందించిన మంత్రి రోళ్ళమడుగు నుంచి నీటిని అందించి ఆ గ్రామం దాహార్తిని తీర్చడంతో గ్రామంలో ఉన్న ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ,మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కొండారెడ్డి, బూతు లెవెల్ కమిటీ సభ్యులు గంగిరెడ్డి మరియు టిడిపి కార్యకర్తలు తో పాటు గ్రామ ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ దాహార్తిని తీర్చిన మంత్రి మండిపల్లికి కృతజ్ఞతలు తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI