Kadapa: విద్యార్థినులకు విద్యా సామగ్రి పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ మాధవి

Kadapa: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు బెడ్ షీట్లు, పుస్తకాలు మరియు విద్యా సామగ్రిని ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవి పంపిణీ చేశారు.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 2 Aug 2026 9:58 PM IST
Kadapa
X

Kadapa: విద్యార్థినులకు విద్యా సామగ్రి పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ మాధవి

కడప: నగరంలోని మునిసిపల్ మెయిన్ హై స్కూల్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో నిర్వహించిన బెడ్ షీట్లు, పుస్తకాలు మరియు ఇతర విద్యా సంబంధిత సామగ్రి పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థినులకు బెడ్ షీట్లు, పుస్తకాలు, విద్యా సంబంధిత సామగ్రిని పంపిణీ చేశారు. విద్యార్థినులు ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story