Kadapa: 'ఇంటింటికీ తెలుగుదేశం'.. డివిజన్‌లో ప్రభుత్వ విప్ మాధవి పర్యటన
Kadapa: కడప నగరంలోని 13వ డివిజన్ ఓం శాంతి నగర్‌లో నిర్వహించిన 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి పాల్గొన్నారు.
Kadapa: 'ఇంటింటికీ తెలుగుదేశం'.. డివిజన్‌లో ప్రభుత్వ విప్ మాధవి పర్యటన
కడప: నగరంలోని 13వ డివిజన్ ఓం శాంతి నగర్, రోడ్ నెం.17లో నిర్వహించిన 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన విజయాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. అలాగే ప్రభుత్వ పాలనా విజయాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు.
అనంతరం స్థానిక ప్రజలతో ముచ్చటిస్తూ వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకుని, ప్రజా సంక్షేమం మరియు కడప అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




