Annamayya: షుగర్ మాత్రలు మింగి మహిళ ఆత్మహత్య.. అన్నమయ్య జిల్లాలో విషాదం!
Annamayya: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో విషాదం నెలకొంది. షుగర్ మాత్రలు మింగి కె. మునెమ్మ (45) అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.
Annamayya: షుగర్ మాత్రలు మింగి మహిళ ఆత్మహత్య.. అన్నమయ్య జిల్లాలో విషాదం!
అన్నమయ్య జిల్లా: జిల్లాలో సోమవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రం మండలం ఆర్ కమతంపల్లెకు చెందిన వెంకటరమణ భార్య కె. మునెమ్మ (45) ఇంట్లో ఉన్న షుగర్ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఘటనపై జిల్లా ఆస్పత్రి ఔట్‌పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Next Story




