Kadapa: కడపలో కలకలం.. నెల రోజులుగా ముగ్గురు పిల్లలతో సహా తల్లి అదృశ్యం!

Kadapa: వైఎస్ఆర్ కడప జిల్లాలో భర్త వేధింపులు తాళలేక ముగ్గురు పిల్లలతో కలిసి 35 ఏళ్ల వివాహిత అదృశ్యమైంది.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 20 May 2026 10:12 AM IST
Kadapa
X

Kadapa: కడపలో కలకలం.. నెల రోజులుగా ముగ్గురు పిల్లలతో సహా తల్లి అదృశ్యం!

కడప:

* భర్త వేధింపులు తాళలేక భార్య ముగ్గురు పిల్లలతో సహా అదృశ్యమైన సంఘటన కడప తాలూకా ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.

* ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

* కడపకు చెందిన హుస్సేన్ అనే వ్యక్తి నగరంలోని ఓ చికెన్ దుకాణంలో పని చేస్తున్నారు.

* అతనికి భార్య (35) ముగ్గురు పిల్లలు సంతానం.

* ఇటీవల ఆమెపై వేధింపులకు పాల్పడుతూ ఉండటంతో గత నెల 10వ తేదీన ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయారు.

* అప్పటి నుంచి వెతుకుతున్నా ఆచూకీ లభ్యం కాలేదు.

* దీంతో మంగళవారం తాలూకా పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story