Kadapa: మలేరియా రహిత సమాజమే లక్ష్యం.. డాక్టర్ సురేష్ బాబు

Kadapa: దువ్వూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవం ఘనంగా జరిగింది.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 25 April 2026 2:49 PM IST
Kadapa
X

Kadapa: మలేరియా రహిత సమాజమే లక్ష్యం.. డాక్టర్ సురేష్ బాబు

Kadapa: మలేరియా రహిత సమాజం - మనందరి లక్ష్యం. ఇప్పుడు మనం చేయగలం, ఇప్పుడు మనం తప్పక చేయాలి" అనే నినాదంతో దువ్వూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మలేరియా నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ మరియు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.

సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైద్యాధికారి డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ, మలేరియాను ఓడించడానికి అవసరమైన శక్తి, విజ్ఞానం మరియు వనరులు ప్రస్తుతం మన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. సామర్థ్యం ఉండి కూడా అమలు చేయకపోతే అది నిర్లక్ష్యమే అవుతుందని, దీనిని ఒక సామాజిక బాధ్యతగా గుర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.

ముఖ్యంగా చిన్న పిల్లలు మలేరియా బారిన పడి ప్రాణాలు కోల్పోవడం విచారకరమని, దీనిని అరికట్టడం మన కనీస కర్తవ్యమని అన్నారు.ఆరోగ్యవంతుడైన పౌరుడే దేశానికి అసలైన ఆస్తి అని, మలేరియా నిర్మూలన ద్వారా దేశం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతుందని ఆయన వివరించారు. మలేరియా రహిత సమాజం దిశగా మనం వేసే ప్రతి అడుగు ఒక ప్రాణాన్ని కాపాడుతుందని తెలిపారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story