Kadapa: పెద్ద దస్తగిరి హత్యతో నాకు సంబంధం లేదు.. బెయిల్‌పై వచ్చి వ్యాఖ్యలు!

Kadapa: పెద్ద దస్తగిరి హత్య కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరైన నేపథ్యంలో సదరు నేత మీడియాతో మాట్లాడారు.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 19 Jun 2026 3:05 PM IST
Kadapa
X

Kadapa: పెద్ద దస్తగిరి హత్యతో నాకు సంబంధం లేదు.. బెయిల్‌పై వచ్చి వ్యాఖ్యలు!

కడప: షరతులతో కూడిన బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. పెద్ద దస్తగిరి హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం. చనిపోయిన పెద్ద దస్తగిరితో ఎలాంటి మనస్పర్థలు లేవని, ఆయన మంచి మిత్రుడని వ్యాఖ్య. తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఆరోపణ.

36 రోజులుగా కస్టడీలో ఉన్నానని బాధతో వెల్లడి. తనకు క్రిమినల్ నేపథ్యం లేదని, నేరస్థులతో ఎటువంటి సంబంధాలు లేవని స్పష్టం. హత్య చేసిన వారికి నాకు ఎటువంటి సంబంధం లేదు. వారికి నేను వాహనం, డబ్బులు ఇచ్చినట్లు తప్పుడు ఆరోపణలు చేశారని విమర్శ.

పోలీసులు అరెస్ట్ చేయలేదని, తానే స్వచ్ఛందంగా లొంగిపోయానన్నారు. మాజీ సీఎం జగన్ పై అభిమానంతోనే పార్టీ కోసం పనిచేశానన్నారు. హత్యతో మనకు సంబంధం లేదు, భయపడవద్దు అని వైఎస్. అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి, అంజాద్ భాష, రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు.

తనను ఎవరూ భయపెట్టలేరని, న్యాయపరంగా పోరాడతానన్నారు. షరతులతో కూడిన బెయిల్ పై ఉన్నాను కాబట్టి చెప్పలేకున్నాను. న్యాయస్థానంలో నాపై పెట్టిన కేసు గురించి చట్టపరంగా పోరాడుతానన్నారు. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతానన్నారు.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story