Kadapa: బద్వేల్ ఎమ్మెల్యే సుధా సంచలన వ్యాఖ్యలు!

Kadapa: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని, మహిళలపై దాడులు ఎక్కువయ్యాయని బద్వేల్ ఎమ్మెల్యే సుధా ఆరోపించారు.

G. RAVI KUMAR, KADAPA
Published on: 21 July 2026 7:26 PM IST
Kadapa
X

Kadapa: బద్వేల్ ఎమ్మెల్యే సుధా సంచలన వ్యాఖ్యలు!

కడప: అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని, మహిళలపై దాడులు అఘాయిత్యాలు ఎక్కువ అయ్యాయని బద్వేల్ ఎమ్మెల్యే సుధా ఆరోపించారు. కడప జిల్లా బద్వేలు ప్రాంతంలో భూతగాదా విషయంలో టిడిపి నాయకులు మహిళపై దాడి చేయడాన్ని కండిస్తూ కడప అంబేద్కర్ సర్కిల్లో నిరసన వ్యక్తం చేశారు. మహిళపై దాడి చేసిన టిడిపి నాయకులను వెంటనే అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్యే సుధా మాట్లాడుతూ ప్రశాంతంగా ఉండే బద్వేల్ ప్రాంతంలో టిడిపి నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారని మహిళలపై దాడులకు సైతం దిగుతున్నారని ఆరోపించారు. బయట ప్రాంతాల నుంచి వచ్చి వృద్ధ దంపతులపై దాడి చేసిన సంఘటనలో బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు రెండు వర్గాలపై కేసులు నమోదు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని మరిచి రెడ్ బుక్ రాజ్యాంగ అమలు చేసేందుకే ప్రాముఖ్యత ఇస్తుందని అన్నారు.

మహిళలందరికీ ఆర్థిక సాయం చేస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత సాయం చేయకపోగా దాడులకు దిగుతున్నారని అన్నారు. హోంమినిస్టర్ వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష, జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి,ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA

Next Story