Rathnakumari: కూలి పనుల కుటుంబం నుండి వైవియూ డాక్టరేట్..రత్నకుమారి ఘనత!
Rathnakumari: కడప యోగి వేమన విశ్వవిద్యాలయంలో తెలుగు పరిశోధకురాలు గంటిపోగు రత్నకుమారి కి రాయలసీమ నవలలపై చేసిన పరిశోధనకు గాను పీహెచ్ディー డాక్టరేట్ లభించింది.
Rathnakumari: కూలి పనుల కుటుంబం నుండి వైవియూ డాక్టరేట్..రత్నకుమారి ఘనత!
రత్నకుమారి: యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పరిశోధక విద్యార‌్థిని గంటిపోగు రత్నకుమారి కి వై.వి.యూ డాక్టరేట్ ని ప్రదానం చేసింది. తెలుగు శాఖ ఆచార్యులు జి.పార్వతి పర్యవేక్షణలో " ఒక దశాబ్ది రాయలసీమ నవలలు-ఒక పరిశీలన" అనే అంశంపై చేసిన పరిశోధనలకు గాను ఈ డాక్టరేట్ ని ప్రదానం చేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణా అధికారి ఆచార్య కె.యస్.వి. కృష్ణారావు ప్రకటించారు.
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూర్ చెందిన రత్నకుమారి తల్లిదండ్రులు నాగభూషణం బేబీ. కూలి పనులు చేసుకుని రత్నకుమారిని చదివించారు. ఈమె యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యు జి సి) నెట్ అర్హత సాధించి ఫెలోషిప్ అందుకుని పీహెచ్డీ ప్రవేశం పొందారు. ఏపీ సెట్ కూడా అర్హత సాధించారు. వారి గ్రామం నుంచి తొలి డాక్టరేట్ ఈమె.




