Pulivendula: పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలి!

Pulivendula: పులివెందులలో 70 బూత్‌లలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అడ్డుకున్నారని వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలను రద్దు చేసి రీపోలింగ్ పెట్టాలని, సుప్రీంకోర్టుకెళ్తామని డిమాండ్.

T. AMARNATH, PULIVENDULA
Published on: 1 Nov 2026 12:23 PM IST
Pulivendula
X

Pulivendula: పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలి!

Pulivendula: పులివెందులలో పోలింగ్ ప్రక్రియపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తమ పార్టీకి చెందిన ఏజెంట్లను 70 పోలింగ్ బూత్‌లలోకి అనుమతించలేదన్నారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకోవడం, ఓటర్ స్లిప్పులు చించివేయడం, దొంగ ఓట్లు వేయడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని చైర్‌పర్సన్ అభ్యర్థిపై, మీడియాపైనా దాడులు జరిగాయని పేర్కొన్నారు.

పోలింగ్ అక్రమాలపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘంతో చర్చించామని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. పులివెందులలో ఎన్నికలను రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం న్యాయపోరాటం చేస్తామని జగన్ ప్రకటించారు.

T. AMARNATH, PULIVENDULA

T. AMARNATH, PULIVENDULA