Duvvuru: దువ్వూరులో ఘనంగా ‘స్వచ్ఛత హై సేవ’ కార్యక్రమం!

Duvvuru: దువ్వూరులో స్వచ్ఛత హై సేవ కార్యక్రమంలో హరిత రాయబారులను శాలువాలతో సన్మానించి పనిముట్లు పంపిణీ చేశారు. అలాగే వారికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 30 Sept 2026 2:24 PM IST
Duvvuru
X

Duvvuru: దువ్వూరులో ఘనంగా ‘స్వచ్ఛత హై సేవ’ కార్యక్రమం!

Duvvuru: గ్రామ పరిశుభ్రతలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని జమ్మలమడుగు డివిజనల్ పంచాయతీ అధికారి (డీఎల్‌పీఓ) నూర్జహాన్, ఎంపీడీవో జవహర్ బాబు పేర్కొన్నారు. స్థానిక దువ్వూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ‘స్వచ్ఛత హై సేవ’ కార్యక్రమంలో భాగంగా హరిత రాయబారులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

​ఈ సందర్భంగా విధి నిర్వహణలో వారికి అవసరమైన పనిముట్లు, రక్షణ సామగ్రిని అధికారులు అందజేశారు. అనంతరం ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో హరిత రాయబారులందరికీ ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సూచనలు అందజేశారు. గ్రామాలను స్వచ్ఛంగా ఉంచడంలో నిరంతరం శ్రమిస్తున్న కార్మికుల సంక్షేమానికి పంచాయతీ పాలకవర్గం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

​ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో హరికృష్ణ, పంచాయతీ కార్యదర్శి (పీడీవో) భాగ్యలక్ష్మి స్వర్ణ, గ్రామ పంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బంది మరియు హరిత రాయబారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR