Duvvuru: నీలాపురం ఎంపీటీసీగా బీజేపీ అభ్యర్థి మనోహర్ రెడ్డి ఘన విజయం!
Duvvuru: వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం నీలాపురం ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అమిరెడ్డి మనోహర్ రెడ్డి 1,814 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.
Duvvuru: నీలాపురం ఎంపీటీసీగా బీజేపీ అభ్యర్థి మనోహర్ రెడ్డి ఘన విజయం!
దువ్వూరు: వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం నీలాపురం ఎంపీటీసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అమిరెడ్డి మనోహర్ రెడ్డి తన సమీప స్వతంత్ర అభ్యర్థిపై 1,814 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. జమ్మలమడుగు పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి (RO) చేతుల మీదుగా ఆయన ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరవీటి హరికృష్ణ, దువ్వూరు మండల బీజేపీ అధ్యక్షుడు పల్లె సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ — తన గెలుపునకు సహకరించిన మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్‌కు, మైదుకూరు అసెంబ్లీ బీజేపీ ఇన్‌ఛార్జ్ ఆరవీటి హరికృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే కూటమి శ్రేణులైన బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ముఖ్యంగా నీలాపురం ఎంపీటీసీ పరిధిలోని ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరి సహకారంతో నీలాపురం ఎంపీటీసీ పరిధిలోని గ్రామాల సమగ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.




