Duvvuru: నీలాపురం, టి.చల్లబసాయిపల్లె ఎంపీటీసీ పోలింగ్ ప్రశాంతం!

Duvvuru: వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు మండలం నీలాపురం, టి.చల్లబసాయిపల్లె ఎంపీటీసీ స్థానాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండలంలో 71.75% పోలింగ్ నమోదైందని ఆర్వో తెలిపారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 5 Nov 2026 6:20 PM IST
Duvvuru
X

Duvvuru: నీలాపురం, టి.చల్లబసాయిపల్లె ఎంపీటీసీ పోలింగ్ ప్రశాంతం!

దువ్వూరు: దువ్వూరు మండల పరిధిలోని నీలాపురం, టి.చల్లబసాయిపల్లె ఎంపీటీసీ స్థానాలకు గురువారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఆర్ఓ రవిచంద్రబాబు తెలిపారు . ఉదయం నుంచే ఎన్నికల అధికారులు పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా దువ్వూరు ఎస్సై ధనుంజయుడు ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

పోలింగ్ కేంద్రాల వద్ద నిరంతరం పర్యవేక్షణ చేపడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నారు. మండలంలో 71. 75 శాతం పోలింగ్ జరినట్లు ఆర్వో రవిచంద్రబాబు తెలియజేశారు. అధికారుల సమన్వయం, పోలీసుల పటిష్ట భద్రత మధ్య రెండు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR