Porumamilla: కాశినాయన మండలంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్!

Porumamilla: వైఎస్సార్ కడప జిల్లా కాశినాయన మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అమగంపల్లె సహా పలు గ్రామాల్లో ఓటర్లు బారులు తీరి ఓటు వేశారు.

P Upendra, Kadapa Porumamilla
Published on: 5 Nov 2026 6:29 PM IST
Porumamilla
X

Porumamilla: కాశినాయన మండలంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్!

పోరుమామిళ్ల: అమగంపల్లె గ్రామంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు క్రమశిక్షణ పాటిస్తూ క్యూ లైన్లలో నిలబడి తమ వంతు వచ్చిన తర్వాత ఓటు వేస్తున్నారు.

ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేపట్టారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. మహిళలు, పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహంగా తరలివస్తున్నారు.

P Upendra, Kadapa Porumamilla

P Upendra, Kadapa Porumamilla