Rayachoti: బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు మాటల గారడీ!
Rayachoti: బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు నాయుడు మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో చట్టం చేయించాలని డిమాండ్ చేశారు.
Rayachoti: బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు మాటల గారడీ!
Rayachoti: బీసీలకు మేలు చేస్తామంటూ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ఆర్భాటపు మాటలుతోనూ, తన నైజం మోసపుచ్చడమే అన్నది మరో సారి రుజువైందని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బీసీలకు మంచి చేయాలన్న ఆలోచనలు వుండవన్నారు. గతంలో దివంగత నందమూరి తారకరామారావు హాయంలోనూ బిసి లకు మంచి జరిగిందన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో ఆరోగ్యశ్రీ,పీజు రీఎంబర్స్ మెంట్ తదితర కార్యక్రమాలు అమలు చేయడంతో బిసి లకు మేలు జరిగిందని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు వల్ల ఎప్పుడూ బిసిలకు మేలు జరగలేదన్నారు. 34 శాతం రిజర్వేషన్ల విషయం సుప్రీం కోర్ట్ నిర్ణయం ప్రకారం చెల్లుబాటు కాదని తెలిసినా మోసపుచ్చి ,జయహో బిసి సభలు పెట్టి,డ్రామా ఆడారన్నారు.
వారి చిత్ర పటాలకు పాలాభిషేకం కూడా చేయించుకున్నారన్నారు.మేము ముందునుంచి ఒక్కటే అడుగుతున్నామని,మీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే షెడ్యూల్ 9 ప్రకారం తమిళనాడులో ఏ విధంగా చట్టం చేశారో ,ఆ రకంగా చట్టం చేసుకోవడానికి, కేంద్రంతో మాట్లాడి పార్లమెంట్ లో చట్టం చేయడానికి ముందుకు రాలేదన్నారు.తన మద్దతుతో నడుస్తున్న ఎన్ డి ఏ ప్రభుత్వం పైన ఉందని, ఇది సరైన సమయమని, బిసి లకు మేలు జరగడానికి పార్లమెంట్ లో చట్టం చేయడానికి కలసిపోరాడుదాము అంటే ముందుకు రావడం లేదన్నారు.
తన మద్దతుతో కేంద్ర ప్రభుత్వం నడుస్తోందని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటారే కానీ బిసి లకు మేలు చేసేందుకు ముందుకు రాకపోవడం దురదృష్టకరమన్నారు.ఇలా మోసపూరిత పనులు చేయకూడదన్నారు.గతంలో వైఎస్ జగన్ బిసి లకు అన్నింట్లలోనూ,నామినేటెడ్ పోస్టులలో 50 శాతం ఉండాలన్న ఆలోచనలు చేసి అసెంబ్లీలో చట్టం చేసారన్నారు.
రాయచోటి మున్సిపాలిటీ గతంలో ఓసి జనరల్ వచ్చినా బిసి లకు ఇచ్చి గౌరవించడం జరిగిందని ఆయన గుర్తుచేశారు. అలాగే నాయి బ్రాహ్మణులకు, రజకులుకు వారికి ఉపయోగ పడే విధంగా ఏడాదికి రూ 15 వేలు అందించారన్నారు.
చంద్రబాబు నాయుడు ప్రజలకు శాస్వితంగా ఉపయోగపడే పనులను ఎప్పుడూ చేయక ప్రజలను మోసాగిస్తూఉంటారన్నారు.చంద్ర బాబు నాయుడు కు బిసి ల రిజర్వేషన్లపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ లో చట్టం చేసేందుకు కేంద్రంతో మాట్లాడి ఒప్పించాలని, ఇందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా నిలుస్తుందన్నారు.




