Kadapa: అమెరికాలో నాసా కేంద్రాన్ని సందర్శించిన శ్రీకాంత్ రెడ్డి

Kadapa: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తన అమెరికా పర్యటనలో భాగంగా ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్‌ను సందర్శించారు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 16 May 2026 10:18 AM IST
Kadapa
X

Kadapa: అమెరికాలో నాసా కేంద్రాన్ని సందర్శించిన శ్రీకాంత్ రెడ్డి

Kadapa: అమెరికాలోని ప్లోరిడా రాష్ట్రంలోని NASA కు చెందిన ప్రతిష్టాత్మకమైన కెన్నడీ స్పేస్ సెంటర్ ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ సందర్శించారు. అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిన నాసా కేంద్రాన్ని ప్రత్యక్షంగా చూడటం జీవితంలో మరపురాని అనుభూతిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచమే కాదు, విశ్వ వ్యాప్తంగా జరుగుతున్న అనేక పరిశోధనలకు నాసా కేంద్రబిందువుగా ఉందని, వాతావరణ మార్పులు, పర్యావరణ పరిస్థితులు, గ్రహాల పరిశోధనలు వంటి ఎన్నో కీలక అంశాలపై నాసా చేస్తున్న కృషి అద్భుతమన్నారు.

చాలా కాలం తరువాత ఈ మధ్యన చంద్రుడి దగ్గరి దగ్గరికి పంపిన మానవ సహిత ఆర్టెమిస్ 2 వెహికల్ ను పంపంచడం చూసామన్నారు. మార్స్ గ్రహాన్ని చేరుకున్న అంతరిక్ష వాహనాలను పరిశీలించినప్పుడు విజ్ఞాన శాస్త్రంలో మనిషి ఎంత దూరం ముందుకు వెళ్లాడో అర్థమవుతుందని ఆయన తెలిపారు. నాసా పరిశోధనలను చూసిన తర్వాత విశ్వం కూడా ఎంతో చిన్నదిగా కనిపిస్తోందన్నారు. అమెరికా పర్యటన ముగింపులో నాసా కేంద్రాన్ని సందర్శించడం ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందన్న ఆయన, భారత యువత కూడా విజ్ఞాన రంగంలో ముందంజలో నిలవాలని ఆకాంక్షించారు.

ఇస్రో మరియు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ప్రపంచ స్థాయి పరిశోధనా కేంద్రాలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.భారతదేశం కూడా భవిష్యత్తులో స్పేస్ స్టేషన్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఆశాభావం వ్యక్తం చేసిన శ్రీకాంత్ రెడ్డి, మన యువత క్రమశిక్షణతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు సాగితే భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. నాసా స్పేస్ సెంటర్‌లో గడిపిన క్షణాలు తనకు అపార ఆనందాన్ని ఇచ్చాయన్నారు. అనతికాలంలోనే మన దేశంలోని ఇస్రో ఎన్నో విజయాలను సాధించిందని, భవిష్యత్ లో నాసా కు ప్రత్యామ్నాయంగా ఇస్రో నిలవాలని ఆకాంక్షిస్తూ జై భారత్ అని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story