Mydukur: వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వైసీపీ నేత నగిరి శ్రీకాంత్!
Mydukur: దువ్వూరు మండలం ఇడమడకకు చెందిన వైసీపీ నాయకుడు నగిరి శ్రీకాంత్ కుటుంబ సమేతంగా వైఎస్ జగన్‌ను కలిశారు.
Mydukur: వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వైసీపీ నేత నగిరి శ్రీకాంత్!
మైదుకూరు, దువ్వూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని దువ్వూరు మండలం ఇడమడక గ్రామానికి చెందిన పార్టీ నాయకుడు నగిరి శ్రీకాంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ తమ కుటుంబ సమస్యలతో పాటు స్థానిక పరిస్థితులను పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను శ్రద్ధగా విన్న జగన్‌మోహన్ రెడ్డి వారికి పూర్తి భరోసా కల్పించారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి తాము ఎల్లవేళలా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, త్వరలోనే మనకు మంచి రోజులు వస్తాయని, అందరూ ధైర్యంగా ముందుకు సాగాలని శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు ఆయన సూచించారు.




