Kadapa: కడపలో జంగిల్ రాజ్, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది రవీంద్రనాథ్ రెడ్డి!

Kadapa: కడపలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపణ. నామినేషన్ల అడ్డుగింపు, తిరస్కరణపై మీడియాతో వ్యాఖ్యలు.

G. RAVI KUMAR, KADAPA
Published on: 25 Oct 2026 4:20 PM IST
Kadapa
X

Kadapa: కడపలో జంగిల్ రాజ్, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది రవీంద్రనాథ్ రెడ్డి!

కడప: జంగిల్ రాజ్ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. కడపలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన టీడీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో సామాన్య ప్రజలు సైతం బతకలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో గూండాయిజం తారాస్థాయికి చేరిందని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అధికారుల కళ్ల ముందే ఘటనలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు.మహిళా అభ్యర్థులతోనూ అనుచితంగా ప్రవర్తిస్తున్నారని రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.

కడపలో జడ్పీటీసీ స్థానాలకు 14 మంది పేర్లతో ఫేక్ నామినేషన్లు వేశారని... 39 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి తమ పార్టీకి చెందిన పలువురి నామినేషన్లు తిరస్కరించారని పేర్కొన్నారు.పైస్థాయి ఒత్తిళ్ల కారణంగానే నామినేషన్లు తిరస్కరిస్తున్నారని ఆరోపించిన ఆయన... జరిగిన అక్రమాలపై అప్పీళ్లకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌తో పాటు వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA