Annamayya: బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి
Annamayya: అన్నమయ్య జిల్లా రాయచోటిలో బక్రీద్ సంబరాలు! త్యాగం, సహనానికి ప్రతీక బక్రీద్ అని పేర్కొన్న వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి.
Annamayya: బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి
Annamayya: త్యాగం, సహనం, ఐకమత్యానికి ప్రతీకగా బక్రీద్ నిలుస్తోందని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం స్ఫూర్తితో ప్రజలు సత్యం, న్యాయం, ధర్మం, త్యాగం, సహనం, పరోపకారం, బాధ్యతాభావం అలవరచుకోవాలని ఆయన కోరారు. దేవుడి దయతో ప్రజలందరూ ఆరోగ్యాలు, సుఖ శాంతులుతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో జరుపు కోవాలన్నారు. మత సామరస్యం వెల్లివిరి యాలన్నారు.ఈ సందర్బంగా ముస్లిం సోదరులకు శ్రీకాంత్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
Next Story




