Rayachoti: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన శ్రీకాంత్ రెడ్డి, అమరనాథ్ రెడ్డి!

Rayachoti: నంద్యాల జిల్లాలో ఆధ్యాత్మిక యాత్ర చౌడేశ్వరి దేవి, యాగంటి ఉమామహేశ్వర స్వామిని దర్శించుకున్న శ్రీకాంత్ రెడ్డి, అమరనాథ్ రెడ్డి.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 3 Sept 2026 6:58 PM IST
Rayachoti
X

Rayachoti: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన శ్రీకాంత్ రెడ్డి, అమరనాథ్ రెడ్డి!

Rayachoti: నంద్యాల జిల్లా లోని నందవరం చౌడేశ్వరీదేవి అమ్మవారిని, కొత్తూరు సుబ్రమణ్యం స్వామి, యాగంటి ఉమామహేశ్వర స్వామి వార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీకాంత్ రెడ్డి, అమర నాధ రెడ్డి.

నంద్యాల జిల్లా లోని నందవరం చౌడేశ్వరీదేవి అమ్మవారిని, కొత్తూరు సుబ్రమణ్యం స్వామి, యాగంటి ఉమామహేశ్వర స్వామి వార్లను గురువారం ఉదయం వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ ఆకేపాటి అమర నాధ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆయా ఆలయాలలో పూజారులు వారిచేత పూజాది కార్యక్రమాలు నిర్వహింపచేసి,తీర్థ ప్రసాదాలు అందించి, దుస్సాలువలతో సత్కరించారు. స్వామి,అమ్మవార్ల కృపా కటాక్షాలతో వర్షాలు సంవృద్దిగా కురిసి, రైతులు, ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా వుండాలని శ్రీకాంత్ రెడ్డి, అమరనాధ రెడ్డి ఆకాంక్షించారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story