Jammalamadugu: రైతులకు నష్టం చేస్తే ఊరుకోం పవర్ గ్రిడ్‌పై ఎమ్మెల్సీ ఫైర్!

Jammalamadugu: కడప జిల్లా ఎస్. ఉప్పలపాడులో పవర్ గ్రిడ్ టవర్లను పరిశీలించిన వైకాపా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి.

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU
Published on: 31 Aug 2026 3:36 PM IST
Jammalamadugu
X

Jammalamadugu: రైతులకు నష్టం చేస్తే ఊరుకోం పవర్ గ్రిడ్‌పై ఎమ్మెల్సీ ఫైర్!

Jammalamadugu: కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్. ఉప్పలపాడు గ్రామ పొలాల్లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విద్యుత్ టవర్లను వైకాపా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి టవర్లు, విద్యుత్ లైన్ల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు, నష్టాలను అడిగి తెలుసుకున్నారు.

పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు అన్ని ఖర్చులు పోను దాదాపు 16 వేల కోట్ల రూపాయలు మిగులుతున్నాయని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తెలిపారు. రైతుల పొలాల్లో టవర్లు, విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడం వల్ల భూముల వినియోగానికి నష్టం కలగడంతో పాటు అసౌకర్యం ఏర్పడుతుందని, భూముల విలువ కూడా తగ్గే అవకాశం ఉందన్నారు.రైతులకు నష్టపరిహారం చెల్లించకుండానే, వారి అనుమతి లేకుండా విద్యుత్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ముందుగా రైతులతో చర్చించి, వారి అంగీకారంతోనే మార్కెట్ విలువ ఆధారంగా నష్టపరిహారం నిర్ణయించాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌ను డిమాండ్ చేశారు. రైతుల అనుమతి లేకుండా కొత్త విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయవద్దని స్పష్టం చేశారు.రైతులకు నష్టం కలిగించే చర్యలను అడ్డుకునేందుకు పార్టీలకతీతంగా అందరూ ఐక్యంగా పోరాడాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU