Proddatur: కొత్తపల్లి పంచాయతీ బరిలో వైసీపీ అభ్యర్థి పోతుబోయిన వీరమ్మ!

Proddatur: ప్రొద్దుటూరు రూరల్ కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోతుబోయిన వీరమ్మను గురువారం మల్లెల మురళీధర్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 21న నామినేషన్ వేయనున్నారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 19 Nov 2026 8:21 PM IST
Proddatur
X

Proddatur: కొత్తపల్లి పంచాయతీ బరిలో వైసీపీ అభ్యర్థి పోతుబోయిన వీరమ్మ!

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంది. సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు వైసీపీ తన అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. ప్రొద్దుటూరు కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోతుబోయిన వీరమ్మను వైసీపీ బరిలో నిలిపింది. మాజీ ఎమ్మెల్యే ఎం.వి. రమణారెడ్డి తనయుడు మల్లెల మురళీధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ఆమె పేరును ప్రకటించారు. ​

గతంలో తాను, తన సతీమణి సర్పంచులుగా పనిచేసి కొత్తపల్లిని ఎంతో అభివృద్ధి చేశామని మురళీధర్ రెడ్డి గుర్తుచేశారు. ఆ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకే వీరమ్మకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ​మరోవైపు, తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మల్లెల మురళీధర్ రెడ్డిలకు వీరమ్మ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నెల 21న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించిన ఆమె.. నేటి సాయంత్రం 5 గంటల నుంచే ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. గ్రామాభివృద్ధి కోసం తనను ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలను కోరారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR