Kadapa: కడపలో వైఎస్సార్‌సీపీ నేత సుంకేసుల బాదుల్లాకు ఘన సన్మానం!

Kadapa: కడప దూదేకుల భవన్‌లో వైఎస్సార్‌సీపీ నూర్ బాష్ దూదేకుల జిల్లా అధ్యక్షులు సుంకేసుల బాదుల్లాకు ఘన సన్మానం జరిగింది. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.

G. RAVI KUMAR, KADAPA
Published on: 14 Sept 2026 9:26 PM IST
Kadapa
X

Kadapa: కడపలో వైఎస్సార్‌సీపీ నేత సుంకేసుల బాదుల్లాకు ఘన సన్మానం!

కడప: కడపలో వైఎస్సార్‌సీపీ నూర్ బాష్ దూదేకుల జిల్లా అధ్యక్షులు సుంకేసుల బాదుల్లాకు ఘన సన్మానం జరిగింది. దూదేకుల భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కడప దూదేకుల భవన్‌లో వైఎస్సార్‌సీపీ నూర్ బాష్ దూదేకుల జిల్లా అధ్యక్షులుగా నియమితులైన సుంకేసుల బాదుల్లాను ఘనంగా సన్మానించారు. దూదేకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పగిడాల పెద్దన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఓ. రసూల్ మాట్లాడుతూ... దూదేకుల సామాజిక వర్గాన్ని గుర్తించి ప్రాధాన్యత కల్పించిన కుటుంబం వైఎస్ కుటుంబమని అన్నారు. దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు, కడప జిల్లాలో పలువురికి వైఎస్ జగన్ పదవులు కల్పించారని పేర్కొన్నారు. పార్టీలో కష్టపడే వారికి పదవులు దక్కుతాయనడానికి బాదుల్లా నియామకమే నిదర్శనమన్నారు.

జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన వైఎస్ జగన్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజాద్ బాషా, మాజీ మేయర్ సురేష్ బాబుకు సుంకేసుల బాదుల్లా కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్‌సీపీకి, దూదేకుల సోదరులకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని చెప్పారు.

జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సంఘం నాయకులు బాదుల్లాను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నాగూరు కుళాయిప్ప, ప్రధాన కార్యదర్శి సిద్దయ్యతో పాటు వివిధ నియోజకవర్గాలు, మండలాల సంఘం నాయకులు పాల్గొన్నారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA