Badvel: మెగా డీఎస్సీ అవకతవకలపై బద్వేలులో భారీ ర్యాలీ, నిరసన దీక్ష!

Badvel: బద్వేలులో డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

B. ARUN KUMAR, BADVEL
Published on: 6 Aug 2026 1:38 PM IST
Badvel
X

Badvel: మెగా డీఎస్సీ అవకతవకలపై బద్వేలులో భారీ ర్యాలీ, నిరసన దీక్ష!

Badvel: డీఎస్సీ అక్రమాలపై బద్వేలులో ప్రజా పోరాటానికి శ్రీకారం.

ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సుధ , నియోజకవర్గ యువ నాయకుడు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి గార్ల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష ప్రారంభం.

డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని, రాజకీయ బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి గారి పిలుపు మేరకు బద్వేల్ నియోజకవర్గంలో నేడు ప్రజా పోరాటానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీ డీసీ గోవిందరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ గారి ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువజనులు, విద్యార్థులు, నిరుద్యోగులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని డీఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో తొలి రోజు దీక్షలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్యే డాక్టర్ సుధ గార్లు మాట్లాడుతూ డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపి నిజాలను వెలికితీయాలని, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

నిజాయితీగా కష్టపడి చదివిన ప్రతి నిరుద్యోగ యువకుడికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిగి బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన, విద్యార్థి, మహిళా విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు భారీ సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL

Next Story