Madanapalle: మదనపల్లిలో ఘోరం.. దళిత వికలాంగుడి ఇంటిని జేసీబీతో పూడ్చేశారు!
Madanapalle: మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లిలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు రవితేజ ఇంటిపై జేసీబీతో దాడి.
Madanapalle: మదనపల్లిలో ఘోరం.. దళిత వికలాంగుడి ఇంటిని జేసీబీతో పూడ్చేశారు!
Madanapalle: మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు, దళిత వికలాంగుడు రవితేజ ఇంటిపై జేసీబీతో దాడి చేసి నిర్మాణంలో ఉన్న ఇంటిని పూడ్చివేయడాన్ని వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. బాధితుడిని పరామర్శించిన నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ఇది అమానుష చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి, రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story




