Palakonda: పాలకొండలో వైఎస్సార్సీపీ కసరత్తు.. ఎన్నికల అధికారులకు ఫారాల అందజేత!

Palakonda: పాలకొండ నియోజకవర్గంలో 287 బూత్ లెవెల్ ఏజెంట్ ఫారాలను సబ్ కలెక్టర్ కార్యాలయంలో అందజేసిన వైఎస్సార్సీపీ నేతలు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 26 May 2026 6:28 PM IST
Palakonda
X

Palakonda: పాలకొండలో వైఎస్సార్సీపీ కసరత్తు.. ఎన్నికల అధికారులకు ఫారాల అందజేత!

Palakonda: పాలకొండ నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన 287 బూత్ లెవెల్ ఏజెంట్ల BLA-2 ఫారాలను ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్, మాజీ శాసన సభ్యులు కళావతి సబ్ కలెక్టర్ గారి కార్యాలయంలోని ఎలక్షన్ డిటి గారికి అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు విక్రాంత్ గారు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల సమన్వయం, ఓటర్ల హక్కుల పరిరక్షణలో వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడేలా SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో భాగంగా ప్రతి BLA -2 ఏజెంట్ కూడా మీ గ్రామాలలో, వార్డ్ లలో ఉన్న BLO (బూత్ లెవెల్ ఆఫీసర్) తో పాటు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితా సమగ్ర విశ్లేషణ చేసి, మన పార్టీ ఓట్లు పోనివ్వకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story